ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా డైమిథైల్ ఈథర్
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:33 AM
ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ఎల్పీజీ భయాలు నెలకొన్న నేపథ్యంలో బిట్స్ పిలానీ, హైదరాబాద్ శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు...
బిట్స్ పిలానీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ఎల్పీజీ భయాలు నెలకొన్న నేపథ్యంలో బిట్స్ పిలానీ, హైదరాబాద్ శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఎల్పీజీకి ప్రత్యమ్నాయంగా డైమిథైల్ ఈథర్(డీఎంఈ) వినియోగం సాధ్యమని వెల్లడించారు. రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విభాగాధిపతి సౌనక్ రాయ్ నాయకత్వంలో సత్యపాల్ సింగ్, రిటైర్డ్ ప్రొఫెసర్ బి.ఎం రెడ్డి తదితరులు కలిసి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే ప్లూగ్యా్‌సను ప్రయోగశాలలో సృషించారు. దీనిని బై-ఫంక్షనల్ పదార్థాల సహాయంతో నీటి ఎలకో్ట్రలిసిస్ ద్వారా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌తో కలిపి డైమిథైల్ ఈథర్‌గా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎల్పీజీతో పోలిస్తే డీఎంఈ కాలుష్య కారకాలను తక్కువగా విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప