మద్యం మత్తులో ఘర్షణ.. బండరాయితో మోది వ్యక్తి హత్య
ABN , Publish Date - Mar 21 , 2026 | 08:08 AM
మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడిచేసి హత్య చేసిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పరారీలో నిందితుడు
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై బండరాయితో దాడిచేసి హత్య చేసిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్(Sanathnagar Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ కుమార్(40), వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన మృతుడు నరేష్(45) ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్ వెంట ఉన్న దుకాణాల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ, అదే ప్రాంతంలో నివసిస్తారు. శుక్రవారం తెల్లవారు జామున 2:45 గంటలకు బుర్హాన్ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ సమీపంలో రోహిత్ కుమార్, నరేష్ కలిసి మద్యం తాగి ఆ తర్వాత గొడవ పడ్డారు.
మాటమాట పెరగడంతో రోహిత్ కుమార్ సమీపంలోని ఓ బండరాయిని తీసుకుని నరేష్ తల, శరీరంపై పదేపదే కొట్టాడు. నరేష్‌కు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం నిందితుడు రోహిత్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణకే ఐఏఎస్ వాణిప్రసాద్: డీవోపీటీ ఉత్తర్వులు
Read Latest Telangana News and National News