Share News

ఇద్దరు భార్యలు ఉన్నా మరో మహిళతో ఎఫైర్.. బస్తాలో శవమై..

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:15 PM

ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉన్నా.. పెళ్లైన మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. శృంగారం కావాలంటూ పదే పదే ఆమెను వేధించటం మొదలెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సోదరుడితో కలిసి అతడిని చంపేసింది.

ఇద్దరు భార్యలు ఉన్నా మరో మహిళతో ఎఫైర్.. బస్తాలో శవమై..
Uttar Pradesh news

లక్నో, మార్చి 23: ఓ వ్యక్తి ఇద్దరు భార్యలు ఉన్నా.. పెళ్లైన మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. శృంగారం కావాలంటూ పదే పదే ఆమెను వేధించటం మొదలెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన మహిళ దారుణమైన నిర్ణయం తీసుకుంది. సోదరుడితో కలిసి అతడిని చంపేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సుమెర్‌పుర్ గ్రామానికి చెందిన ముక్తాకా గుల్సన్ అలియాస్ మున్నాకు ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరికి 18 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు భార్యలు ఉన్నా కూడా మున్నా తప్పుదారి పట్టాడు.


అదే గ్రామానికి చెందిన సుమన్ దేవీ అనే వివాహితతో ఎఫైర్ పెట్టుకున్నాడు. సుమన్ దేవీ భర్త పని కోసం వేరే రాష్ట్రం వెళ్లిపోవటంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. మున్నా ఆమెకు తరచుగా సాయం చేస్తూ ఉండేవాడు. ఈ సమయంలోనే ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి ఎఫైర్ కొంత కాలం సజావుగానే నడిచింది. అయితే, శృంగారం కావాలంటూ మున్నా పదే పదే ఆమెను వేధిస్తూ ఉండేవాడు. అతడి వేధింపులు రోజు రోజుకు పెరిగిపోవంతో సుమన్ దేవీ తట్టుకోలేకపోయింది. ఎలాగైనా అతడి అడ్డుతొలగించుకోవాలని భావించింది.


వేధింపుల గురించి తమ్ముడికి చెప్పింది. ఇద్దరూ మున్నాను చంపటానికి ప్లాన్ చేసుకున్నారు. మార్చి 18వ తేదీన సుమన్ దేవీ.. మున్నాను ఇంటికి రమ్మని పిలిచింది. సుమన్ దేవీ తమ్ముడు, అతడి ఇద్దరు స్నేహితులు మున్నా రాకకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మున్నా ఇంటి లోపలికి వెళ్లగానే ముగ్గురూ అతడి తలపై రాడ్లతో కొట్టి చంపారు. తర్వాత శవాన్ని బస్తాలో కుక్కి ఓ కెనాల్‌లో పడేశారు. మున్నా ఎంతకీ ఇంటికి రాకపోవటంతో మున్నా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో సుమన్ దేవీకి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సుమన్ దేవీతో పాటు ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కెనాల్‌నుంచి శవాన్ని వెలికి తీశారు.


ఇవి కూడా చదవండి

ఘోర ప్రమాదం: మాగంటి గోపినాథ్ కుమార్తెకు తీవ్ర గాయాలు

ఈ పండ్లు, కూరగాయలను కలిపి నిల్వ చేయకండి.. ఎందుకంటే

Updated Date - Mar 23 , 2026 | 05:12 PM