బ్లూ డ్రమ్ భయం.. భార్యను ప్రియుడితో పంపేసిన భర్త..
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:37 PM
ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. బ్లూ డ్రమ్ ప్రస్తావన కూడా తెచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త భయపడిపోయాడు. భార్యను ఆమె ప్రియుడితో పాటు పంపేశాడు.
లక్నో, మార్చి 19: మీరట్ బ్లూ డ్రమ్ కేసు గుర్తుందా?.. ముస్కాన్ అనే మహిళ ప్రియుడు సాహిల్‌తో కలిసి భర్త సౌరభ్‌ను చంపేసింది. శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్‌లో సిమెంట్ వేసి కప్పెట్టింది. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. భర్తలపై కోపం ఉన్న చాలా మంది మహిళలు బ్లూ డ్రమ్ పేరు చెప్పి భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా, ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. బ్లూ డ్రమ్ ప్రస్తావన కూడా తెచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భర్త భయపడిపోయాడు. భార్యను ఆమె ప్రియుడితో పాటు పంపేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బులందేశ్వర్‌కు చెందిన రాజ్‌కుమార్ భార్య అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. గత సంవత్సరం పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో వెళ్లిపోయింది. నెల రోజుల పాటు తన ఆరు నెలల బిడ్డను భర్త దగ్గర వదిలేసి ప్రియుడితో ఉండిపోయింది. భార్యపై అనుమానం వచ్చిన రాజ్‌కుమార్ ఆమెను పలుమార్లు నిలదీశాడు. ఆమె మాత్రం తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెబుతూ వచ్చింది. ఓ రోజు ప్రియుడితో మాట్లాడుతుండగా రాజ్‌కుమార్ భార్య ఫోన్ లాక్కున్నాడు.
ఫోన్‌ను చెక్ చేసి చూడగా.. ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో కొన్ని నగ్న చిత్రాలు, మర్డర్ స్టోరీలు షేర్ చేసి ఉన్నాయి. ‘సిమెంట్, డ్రమ్ స్టోరీ’ పేరిట ఆ మర్డర్ స్టోరీలు షేర్ చేసి ఉండటంతో రాజ్‌కుమార్ భయపడిపోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ జరిగింది. తాను రాజ్‌కుమార్‌తో ఉండనని, ప్రియుడితో వెళతానని ఆమె తేల్చి చెప్పింది. దీంతో రాజ్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భార్యను ఆమె ప్రియుడితో పాటు పంపడానికి అంగీకరించాడు.
ఇవి కూడా చదవండి
రెయిన్ అలర్ట్.. మరో మూడుగంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
బీపీ ఎక్కువైతే పక్షవాతం వస్తుందా?