Home » Uttam Kumar Reddy Nalamada
తుమ్మడిహెట్టిని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్ గుండె అని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలిందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెల్ల ఏనుగులా భారంగా మారిందనడం సరికాదని.. నిజానికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌లే తెలంగాణ పాలిట తెల్ల ఏనుగులని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.
జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇస్తేనే వణికిపోతున్నారు.. కమిషన్ నివేదిక ఇచ్చాక ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు తప్పవు.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోర తప్పిదాలు జరిగాయని రాజ్యాంగబద్ధంగా పని చేసే అన్ని సంస్థలు తప్పుబట్టాయి.
విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ముఖ్యంగా కాకినాడ ఓడరేవు నుంచి ఎగుమతిలో సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి.
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా టన్నెల్ తవ్వకాలు, మరమ్మతులు చేపట్టాలని మరియు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సూచించారు,
ఈ ఏడాది యాసంగిలో వరి సిరులు కురుస్తున్నాయి. 60లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు రోజూ 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల ధాన్యం కాంటా పెడుతున్నారు.
జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎన్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక(జియో టెక్నికల్), భూ భౌతిక(జియో ఫిజికల్) పరీక్షలను వెంటనే చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కృష్ణా జలాల్లో న్యాయమైన 70 శాతం వాటా సాధించేలా ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తెలంగాణలో రబీ సీజన్‌లో 43 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లపై హరీశ్ రావు చేసిన విమర్శలు అసత్యమని స్పష్టం చేశారు.