Share News

Uttam: కాళేశ్వరం బ్యారేజీలకు పరీక్షలు చేయించండి

ABN , Publish Date - May 17 , 2025 | 03:34 AM

జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎన్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక(జియో టెక్నికల్‌), భూ భౌతిక(జియో ఫిజికల్‌) పరీక్షలను వెంటనే చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Uttam: కాళేశ్వరం బ్యారేజీలకు పరీక్షలు చేయించండి

  • వానాకాలంలోపు పూర్తి చేసి నివేదికలు తెప్పించండి

  • ఎస్‌ఎల్‌బీసీలో డీబీఎంకు చర్యలు చేపట్టండి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎన్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కేంద్ర సంస్థలతో భూ సాంకేతిక(జియో టెక్నికల్‌), భూ భౌతిక(జియో ఫిజికల్‌) పరీక్షలను వెంటనే చేయించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలంలోపే పరీక్షలన్నీ పూర్తిచేయించి, నివేదికలు తెప్పించుకోవాలని నిర్దేశించారు. శుక్రవారం జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రిసెర్చ్‌ స్టేషన్‌(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స-ఢిల్లీ)తో.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కేంద్ర జల, విద్యుత్‌ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స-పుణె)తో పరీక్షలు చేయించాలని నిర్దేశించారు.


ఆయా సంస్థలకు లేఖలు రాసి, సకాలంలో పరీక్షలు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కాగా, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌(ఎ్‌సఎల్‌బీసీ) ఇన్‌లెట్‌(దోమలపెంట-శ్రీశైలం) వైపు డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం(డీబీఎం)లో టన్నెల్‌ తవ్వకం చేపట్టడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ అధికారులను ఆదేశించారు. దీనికోసం నిర్మాణ సంస్థ ప్రతినిధులను పిలిపించాలని నిర్దేశించారు. ఇన్‌లెట్‌ వైపు నుంచి 13.9 కి.మీ. తవ్వాక ఫిబ్రవరిలో సొరంగం కూలిపోయి టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌(టీబీఎం) పూర్తిగా ధ్వంసమైంది. మళ్లీ టీబీఎంను వాడే అవకాశాలు లేకపోవడంతో తక్షణమే డీబీఎం విధానంలో టన్నెల్‌ తవ్వకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 03:34 AM