Share News

Uttam: యాసంగి ధాన్యం సేకరణలో రికార్డు

ABN , Publish Date - May 18 , 2025 | 03:55 AM

ఈ ఏడాది యాసంగిలో వరి సిరులు కురుస్తున్నాయి. 60లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు రోజూ 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల ధాన్యం కాంటా పెడుతున్నారు.

Uttam: యాసంగి ధాన్యం సేకరణలో రికార్డు

  • 51.30 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు

  • మూడేళ్లలోనే రికార్డు బ్రేక్‌: మంత్రి ఉత్తమ్‌

  • మరో నెల వరకూ ధాన్యం కొనుగోళ్లు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది యాసంగిలో వరి సిరులు కురుస్తున్నాయి. 60లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు. 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాలకనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు రోజూ 1.75 లక్షల నుంచి 2 లక్షల టన్నుల ధాన్యం కాంటా పెడుతున్నారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో పది లక్షల టన్నుల పైచిలుకు తూకం వేయని ధాన్యం ఉందని పౌర సరఫరాలశాఖ నివేదికలు చెబుతున్నాయి. మరో నెల పాటు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిర్ణీత 71లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి ధాన్యం సేకరణ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వరి కోతలు సాగుతుండటంతో జూన్‌ మొదటి పక్షం రోజుల వరకూ ధాన్యం కొనుగోళ్లు జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం శనివారానికి 51.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుచేసింది.


ఈ యాసంగిలో ఇప్పటికే 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణతో రికార్డు బ్రేక్‌ చేశామన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఇది గత మూడేళ్లలోనే రికార్డు అని పేర్కొన్నారు. ఈసారి 71లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తామన్నారు. ఈ ఏడాది కొత్తగా 1,311 కేంద్రాలతో మొత్తం 8,348 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సాగుతోందని చెప్పారు. 2022-23 యాసంగి మే 15కల్లా 25.35 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2023-24లో 32.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల సంస్థ సేకరించింది. కాగా, ఇప్పటివరకూ సేకరించిన ధాన్యంలో సన్న రకం 17.37 లక్షల మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం 34 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉంటాయి. అంటే పౌరసరఫరాల సంస్థ రూ.11,913 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రూ.8,511 కోట్లు రైతులకు చెల్లించింది. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తోంది. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనాలని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 03:55 AM