Home » Uravakonda
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అ శ్వవాహనంపై కొలువుదీర్చారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్ హౌస్ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.
పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్‌లో బుధవారం చెస్ జిల్లా స్ధాయి అండర్-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు.
ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వాణిజ్య గ్యాస్ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు.
నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తి గా ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించినా పలువురు హెచఎంలు స్పందించడం లేదు. మండలంలో నాడు- నేడు మొ దటి, రెండో విడత కింద గత వైసీపీ పాలనలో వివిధ పాఠశాలలకు నిధులు విడుదల చేశారు.
పాడి పరిశ్రమలో కీలకమైన పశుగ్రాసం కొరతతో పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ కారణాలతో వరి పంట కోసేందుకు యంత్రాలు ఉపయోగిస్తు న్నారు. ఇందులో మమకూలీల కొరత ఒక కారణమైతే, ఖర్చులు పెరగ డంతో సాగుదారులు యంత్రాలపై ఆధారపడడం ఏటా పెరుగుతోంది.
మండల పరిధిలోని పెన్నహో బిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హంస వాహనంపై నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతా ళాల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా రోడ్డు వేయకుండా ఉండడంతో మండలంలోని డొనేకల్లు-ఆర్ కొట్టాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతులపై అధికా రులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే విమర్శిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో డొనేకల్లు నుంచి 1.5కిలో మీటర్ల దూరం బీటీ రోడ్డు(తారురోడ్డు) వేశారు.
వజ్రకరూరు మం డలంలోని చాబాల గ్రామంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవా న్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల యంలో మూలవిరట్‌కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.