Share News

SCHOOL: కలెక్టర్‌ ఆదేశించినా స్పందన కరువు

ABN , Publish Date - May 04 , 2026 | 11:40 PM

నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తి గా ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించినా పలువురు హెచఎంలు స్పందించడం లేదు. మండలంలో నాడు- నేడు మొ దటి, రెండో విడత కింద గత వైసీపీ పాలనలో వివిధ పాఠశాలలకు నిధులు విడుదల చేశారు.

SCHOOL: కలెక్టర్‌ ఆదేశించినా స్పందన కరువు
Unfinished works in Kammuru school

- పాఠశాలల్లో ప్రారంభంకాని అసంపూర్తి పనులు

- పట్టించుకోని ప్రధానోపాధ్యాయులు

కూడేరు, మే 4(ఆంధ్రజ్యోతి): నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో అసంపూర్తి గా ఉన్న పనులను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించినా పలువురు హెచఎంలు స్పందించడం లేదు. మండలంలో నాడు- నేడు మొ దటి, రెండో విడత కింద గత వైసీపీ పాలనలో వివిధ పాఠశాలలకు నిధులు విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వచ్చా క ఆ పనులను నిలిపివేశారు. నిధులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అ నుమతులు వచ్చే వరకు పనులు చేయడం సాధ్యం కాదని హెచఎం లు కాలం గడిపారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు రావడంతో నా డు- నేడు నిధులున్న పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలని కలెక్టర్‌ ఇటీవల ఆదేశించారు.


అయితే కొందరు హెచఎంలు ఇంత వరకు అమలు చేయలేదు. మిగిలిన నిధుల వివరా లను సంబంధిత హెచఎంల నుంచి నాలుగు రోజుల క్రితం ఎంఈవో సేకరించారు. వాటితో పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. అయినా కొందరు హెచఎంలు శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నాడు - నేడు నిధులున్న పాఠశాలలు

కూడేరు మండలంలో నాడు-నేడు రెండో విడత కింద 14 ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత, ఆరు జడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీ వీని ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు విడుదల చేసిన ని ధుల్లో కొంత ఖర్చు చేయగా, ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేశారు. ఇందులో ప్రధానంగా జల్లిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ. 6.50 లక్షలు, కమ్మూరు పాఠశాలలో రూ. 8.43 లక్షలు, కూడేరు పాఠశాలలో (1, 2విడతలు) రూ. 13 లక్షలు, కేజీబీవీలో రూ. 2.90 లక్షలు ఉన్నాయి. జయపురం ప్రాథమిక పాఠశాలలో రూ. 1.63 లక్షలు, అరవకూరు ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో రూ. 1.03 లక్షలు, ఉదిరిపికొండ ప్రాథమి కోన్నత పాఠశాలలో రూ, 1.30 లక్షలు నిధులున్నాయి. మరిన్ని పాఠశా లల్లో రూ. 50వేల వరకు నిధులు మిగిలాయి. ఆ నిధులతో పనులు చేయించాలని ఎంఈఓ-2 సాయుకృష్ణ హెచఎంలకు సూచించారు. మే మొదటి వారంలో పనులు ప్రారంభంకావాలని,


పాఠశాల యాజమా న్య కమిటీలతో చర్చించి విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించాలన్నారు. అయితే కొందరు హెచఎంలు మే మొదటి వారం పూ ర్తి అవుతున్నా తమకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తు న్నారని పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వేగవంతంగా పూర్తి చేయాలి - సాయికృష్ణ, ఎంఈఓ-2, కూడేరు

నాడు-నేడు కింద నిధులున్న పాఠశాల్లో పను లను వేగవంతంగా చేయాలి. పాఠశాల ల పునః ప్రారంభ సమయానికి విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడంతోపాటు అసంపూర్తి గా ఉన్న పనులు పూర్తి చేయాలి. ఇప్పటి వరకు కొన్ని పాఠశాలల్లో పనులు చేయడానికి పాఠశాల కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన పాఠశాలల హెచఎంలు. కలెక్టర్‌ అదేశాల ప్రకారం పనులు పూర్తి చేయాలి. పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 04 , 2026 | 11:40 PM