Share News

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - May 07 , 2026 | 12:11 AM

సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి
Workers Protest

- సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల డిమాండ్‌

గుత్తి, మే6(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు. సమ్మెలో భాగంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్ర మంలో వారు మాట్లాడుతూ.... కార్మికులకు ఐదు నెలల వేతనాలు చెల్లించాలని, సత్యసాయి నీటి పథకాన్ని జిల్లా పరిషతలోకి కలపకుండా యధావిధిగా కొనసాగించాలని, ఈ పథకానికి బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన నాయకులు రామాంజినేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

కూడేరు: తమకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ సత్యసాయి తాగునీటి కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వారు బుధవారం మండలంలోని పీఏబీఆర్‌ డ్యాంలో సత్యసాయి తాగునీటి పథకం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. వేతనాలు చెల్లించే వరకు ఉద్యమం ఆగదని కార్మికులు తెలియజేశారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 07 , 2026 | 07:11 AM