Share News

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

ABN , Publish Date - May 04 , 2026 | 11:46 PM

వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు.

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి
CPM leaders protesting with an empty cylinder

- సీపీఎం నాయకుల డిమాండ్‌

గుంతకల్లు టౌన, మే 4(ఆంధ్రజ్యోతి): వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ పశ్చిమాసియా యుద్ధం నేప థ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఒక సారి గ్యాస్‌ ధరలను పెంచిం దన్నారు. మళ్లీ వాణిజ్య సిలిండర్‌ ధరను రూ. 993.50 పెంచడంతో చిరువ్యాపారులు, చిన్న హోటళ్లు కోలుకోలేని పరిస్థితి నెలకొంద న్నారు. కొన్ని చోట్ల దుకాణాలు మూడపడ్డాయన్నారు. పెంచిన వాణిజ్య గ్యాస్‌ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతిప్రసాద్‌, నాయకులు సాకే నాగరాజు, జ్యోతి, వెంకీ, ఈరన్న, భాష, షేక్షావలి, లక్ష్మి, చిట్టి, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 04 , 2026 | 11:46 PM