GOD: నారసింహుడికి అశ్వవాహన సేవ
ABN , Publish Date - May 07 , 2026 | 11:31 PM
మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి ఉ త్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అ శ్వవాహనంపై కొలువుదీర్చారు.
ఉరవకొండ, మే 7(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి ఉ త్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అ శ్వవాహనంపై కొలువుదీర్చారు. ఆలయం చుట్టూ ఊరేగించారు. భ క్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి అంగదాల నారాయణస్వామి కుటుంబసభ్యులు ఉభయదారులుగా వ్యవహరించా రు. ఈ కార్యక్రమంలో ఈవో రమేష్‌బాబు, సిబ్బంది అర్చకులు పాల్గొ న్నారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ధ్వజా వరో హణం, శయనోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....