Share News

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

ABN , Publish Date - May 04 , 2026 | 11:50 PM

ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం
Minister Keshav with the beneficiaries receiving the cheques

- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ/బెళుగుప్ప, మే 4(ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 101 మందికి రూ.36.16 లక్షల చెక్కు లను అందజేశారు. ఉరవకొండ మండలంలోని 42 మందికి, కూడేరు 12 మందికి, వజ్రకరూరు 25 మందికి, విడపనకల్లు 12 మందికి, బె ళుగుప్ప మండలంలోని 10 మందికి చెక్కులను ఇచ్చారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినిమోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన విజయ్‌ భాస్కర్‌, టీడీపీ నాయకులు మల్లికార్జున, తిప్పయ్య పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 04 , 2026 | 11:50 PM