CHESS: రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - May 07 , 2026 | 12:15 AM
పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్‌లో బుధవారం చెస్ జిల్లా స్ధాయి అండర్-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు.
గుంతకల్లు టౌన, మే 6(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్‌లో బుధవారం చెస్ జిల్లా స్ధాయి అండర్-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు. తాడిపత్రికి చెందిన రత్నతేజ్ నాలుగు రౌండ్లలో 3.5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో అనంతపురానికి చెందిన షరోన బ్లేస్సి మూడు రౌండ్లలో మూడు రౌండ్లు గెలచి ప్రథమ స్ధానంలో, తాడిపత్రికి చెందిన హారిక చౌదరి మూడు రౌండ్లలో రెండు పాయింట్లు సాధించి ద్వితీయ స్ధానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఆంధ్రచెస్ జాయింట్ సెక్రటరీ నాగార్జున కర్ణాటకం మాట్లాడుతూ ఈ నలుగురు క్రీడాకారులు ఈ నెల 9, 10వ తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-11 పోటీలకు అనంతపురం జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....