Home » UAE
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న 'ఫ్లైదుబాయ్' విమానంలో ఊహించని రీతిలో మిడ్‌ఎయిర్ డిజాస్టర్ తృప్తిలో తప్పింది. అయితే, ఈ విమానం సురక్షితంగా బయటపడటంలో ఓ 6 ఏళ్ల చిన్నారి టాయిలెట్‌కి వెళ్లడం ఒక కీలక మలుపుగా మారింది.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని షార్జాలో దారుణ హత్యకు గురయ్యారు. జూలైలో ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు.
ఇరాన్‌తో అన్ని వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అఫ్రా అల్ హమెలీ ప్రకటన విడుదల చేశారు.
దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యూఏఈ ముందుకు వచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిందని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉద్ధృతమవుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలమవడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఇరాన్, అమెరికా దేశాల మధ్య జూన్ నెలలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. తమ అనుమతి లేకుండా హోర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. తాజాగా, హోర్ముజ్ జలసంధిలోని ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న రెండు యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటంతో ఓ భారతీయుడు గల్లంతయ్యారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
అబుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు.