Home » TTD
వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్ బీఆర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
తిరుమలలో అరుదైన పచ్చ నాగుపాము కనిపించింది. సాధారణంగా నాగుపాములు బూడిద రంగులో ఉంటాయి. అయితే తిరుమలలో మాత్రం బుధవారం సాయంత్రం పచ్చ రంగులో ఉన్న నాగుపాము ప్రత్యక్షమై అందరినీ అశ్చర్యపరిచింది.
కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి.
తిరుమల పరకామణిలో చోరీ ఇప్పుడే కొత్తగా జరిగినట్లు పెద్ద అక్షరాల్లో వార్తలు రాస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. దీని వెనక తిరుమల హుండీకి కానుకలు రాకుండా చేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.
తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామిలపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్ రికార్డులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులను తారుమారు చేశారని కూడా తెలిపింది.
వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.