Tirumala: అన్నప్రసాద ట్రస్టు కార్పస్ నిధులు బాగా పెరిగాయ్..
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:35 PM
టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు.
- టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల: టీటీడీ అన్నప్రసాదం నాణ్యత, రుచులపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్టు కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం సాయంత్రం ఆయన తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూలైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలోని వివిధ పాయింట్ల వద్ద అన్నప్రసాదాల పంపిణీ తదతర అంశాలపై సమాచారం సేకరించారు.
అలాగే వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బ్లాక్స్‌లను పరిశీలించి అఽధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్నప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారిసేవలకులతో కూడా మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం 1985లో ప్రారంభమై, 1994లో అన్నప్రసాదం ట్రస్టుగా ఏర్పడిందన్నారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆతర్వాత స్వయం సమృద్ద్ధిని సాధించిందన్నారు. ఏటా విరాళాలు పెరగుతున్నాయన్నారు. 2023-24లో కార్పస్ రూ.1,854 కోట్లు, 2024-25లో రూ.2127 కోట్లు, 2025 ఆగస్టు వరకు రూ.2,263 కోట్లకు చేరిందన్నారు.

వడ్డీల రూపంలో 2024లో రూ.221 కోట్లు, 2025లో రూ.270 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుత వార్షిక వ్యయం రూ.150 కోట్లు ఉందన్నారు. రూ.కోటి విరాళదాతలు కూడా పెరిగారని, 2023-24లో 14 మంది ఉంటే, 2024-25లో 25 మంది, ఈ సంవత్సరం ఐదు నెలల్లో 14 మంది రూ.కోటికిపైగా విరాళాలు అందజేశారని వివరించారు. ప్రస్తుతం తాము వార్షిక బ్రహ్మోత్సవాలపై దృష్టిసారించామని, భక్తుల అభిప్రాయాలు, ఈ-మెయిళ్లు, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈతనిఖీల్లో అన్నప్రసాదం డిప్యూటీఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ఆఫీసర్ శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన ధరలకు బ్రేక్..భారీగా తగ్గిన బంగారం, వెండి
శశికళ కేసు హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
Read Latest Telangana News and National News