Tirumala: శోభాయమానం.... తిరుమల క్షేత్రం
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:25 AM
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది.
తిరుమల, , సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో తిరుమల కొండ శోభాయమానంగా దర్శనమిస్తోంది. రూ.5.50 కోట్లతో విద్యుద్దీపాలంకరణ చేపట్టంతో నూతన అందాలతో స్వామి క్షేత్రం కనువిందు చేస్తోంది. శ్రీవారి గర్భాలయం నుంచి మహద్వారం వరకు, ప్రాకారం, గోపురం, మాడవీధుల్లోని ముఖ్యమైన భవనాలకు రంగురంగు లైట్లతో విద్యుత్ అలంకరణలు చేశారు. ప్రధాన కూడళ్లలోనూ విద్యుత్ తీగలతో పాటు వివిధ దేవతామూర్తుల భారీ కటౌట్లు, లైట్లతో కూడిన ప్లాస్టిక్ చెట్లు, సప్తద్వారాలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి.