Home » Trending News
ఓ వ్యక్తి రోడ్డు పక్కన బండిపై చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ఆ హోటల్ బోర్డుపై .. ఇది ప్యూర్ వెజిటేరియన్ మోటల్.. అని రాయించాడు. దీంతో వెజిటేరియన్స్ మొత్తం ఆ హోటల్ వైపు క్యూ కట్టారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది..
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఇంటి గది లోపలి దృశ్యం కనిపిస్తోంది. ఈ గదిలో ఓ పెద్ద లేబుల్‌పై చాలా వస్తువులను చూడొచ్చు. అలాగే పక్కన రెండు కుర్చీలు కూడా ఉంటాయి. అదేవిధంగా కాస్త దూరంలో సోఫా కూడాఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ కుక్క కూడా దాక్కుని ఉంది. అదెక్కడుందో కనుక్కోండి చూద్దాం..
ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
తమ ఇళ్లు, దుకాణాల ముందు వింత వింత సందేశాలు రాయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓ స్త్రీ రేపురా.. బంగారం, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి.. వంటి చిత్రవిచిత్రమైన సందేశాలను రాయడం చూస్తుంటాం. అలాగే తాజాగా..
ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ట్రంప్ అమెరికాపై 50 శాతం సుంకం విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అగ్రరాజ్యానికి ప్రతీకార సుంకాలతోనే బదులు ఇవ్వాలని సూచించారు.
అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రచ్చ నడుస్తోంది. అటు అధికార పార్, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు తగ్గేదేలే అంటూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడారు.