-
-
Home » Mukhyaamshalu » INSTANT BREAKING NEWS FROM ABN across world on 23rd august VReddy
-
BREAKING: లిక్కర్ స్కామ్ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి
ABN , First Publish Date - Aug 23 , 2025 | 06:16 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
Aug 23, 2025 21:00 IST
లిక్కర్ స్కామ్ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి
సిట్ ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పా: నారాయణస్వామి
నాకు జగన్ ఎప్పుడూ ఏదీ చెప్పలేదు: నారాయణస్వామి
కేబినెట్‌లో లిక్కర్ పాలసీపై నిర్ణయం తీసుకున్నాం: నారాయణస్వామి
చంద్రబాబుతో శత్రుత్వంలేదు.. పాలసీపైనే మాట్లాడుతున్నా: నారాయణస్వామి
-
Aug 23, 2025 19:00 IST
అనంతపురం: వైసీపీ కార్యకర్త పల్లెపు రమేష్ అరెస్ట్
తల్లికి పెన్షన్ ఇవ్వకపోవడంతో వీడియో పోస్ట్ చేశానంటూ..
మాట మార్చిన వైసీపీ కార్యకర్త రమేష్
పెన్షన్ విషయంలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన రమేష్ అరెస్ట్
నా మానసిక స్థితి బాగోలేక అలా చెప్పా: రమేష్
మద్యం మత్తులో మాట్లాడా: పల్లెపు రమేష్
మా అమ్మకి పెన్షన్ రాలేదని అలా వీడియో చేస్తే..
పెన్షన్ వస్తుందని తప్పుడు ప్రచారం చేశా: రమేష్
నాకెవరూ చెప్పలేదు... వైసీపీ నేతలెవరూ ఇలా చేయమని చెప్పలేదు
నాకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై కక్ష లేదు: రమేష్
-
Aug 23, 2025 16:37 IST
అమెరికాకు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన భారత్
కస్టమ్ నిబంధనల్లో మార్పులతో సేవలు తాత్కాలికంగా నిలిపివేత
-
Aug 23, 2025 15:17 IST
వరంగల్: కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం..
కాంగ్రెస్‌ను థార్డ్ క్లాస్ పార్టీ అనడంపై మండిపాటు.
థార్డ్ క్లాస్ అంటే అర్థం ఏంటీ..? కేటీఆర్ చెప్పాలి.
పేదల ప్రజల పక్షాన పోరాడితే థార్డ్ క్లాసా..?
తక్కువ కులాల పక్షాన పోరాడటం థార్డ్ క్లాసా...?
కేటీఆర్ అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. పకరతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది.
అందుకే జనహిత పాదయాత్ర చేస్తున్నాం.
ఈనెల 25న వరంగల్ జిల్లా వర్థన్నపేటలో జరిగే జనహిత పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు: సీతక్క
-
Aug 23, 2025 15:14 IST
నిందితుడిని చంపేయాలి: సహస్ర తల్లి రేణుక
నా కూతుర్ని హత్య చేసినట్లు ఆ అబ్బాయిని హత్య చేయాలి.
ఎన్నో ఆరోపణలు చేశారు.
నా మీద నా భర్త మీద.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని మేము చంపుకున్నాము అని నా మీద విమర్శలు చేశారు.
నా కొడుకు ఆలోచన తీరు మారింది.
అక్కను చంపిన వాడిని నేను చంపుతాను అంటూ నా కొడుకు మాట్లాడుతున్నాడు.
ఒక్క బ్యాట్ కోసం ఇంత దారుణానికి ఒడిగడతాడా.
మొబైల్ తీసుకొచ్చినప్పుడే తల్లిదండ్రులు పరిశీలించి ఉంటే ఈ రోజు నా కూతురికిలా అయ్యేది కాదు.
ఈ విషయంలో మైనర్ అబ్బాయి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది.
మాకు న్యాయం జరగాలి.. నిందితుడి మా ముందుకు తీసుకురావాలి.
-
Aug 23, 2025 15:08 IST
కూకట్‌పల్లి పీఎస్ ఎదుట సహస్ర తల్లిదండ్రుల ఆందోళన..
అసలైన దోషులను తప్పించారంటూ సహస్ర బంధువుల ఆరోపణ.
నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్.
-
Aug 23, 2025 15:06 IST
సహస్ర తండ్రి కృష్ణా సంచలన ఆరోపణలు
క్రికెట్ బ్యాట్ కోసం కాదు ఇంట్లోని డబ్బు కోసమే బాలుడు వచ్చాడు
సహస్ర హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమేయం ఉంది: కృష్ణా
న్యాయం జరగకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం
కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు అనుమానం: సహస్ర తండ్రి కృష్ణా
పోలీసులు మరోసారి దర్యాప్తు చేయాలి: సహస్ర తండ్రి కృష్ణా
-
Aug 23, 2025 14:01 IST
ట్రంప్ దెబ్బతో 60 ఏళ్ల తర్వాత అమెరికాకు తగ్గిన వలసలు
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 15లక్షలకు తగ్గిన వలస జనాభా
1960 తర్వాత వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి
-
Aug 23, 2025 12:41 IST
హైదరాబాద్: సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు
OTT, యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య
పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను చంపిన బాలుడు
పోలీసులను సైతం తప్పు దోవ పట్టించిన బాలుడు
హత్య తర్వాత ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న బాలుడు
పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెన్స్‌గా వ్యవహరించిన బాలుడు
-
Aug 23, 2025 12:40 IST
హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలి: కమిషనర్ రంగనాథ్
హైడ్రా ఒకటి రెండేళ్లకు పరిమితం కాదు: కమిషనర్ రంగనాథ్
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ది చేస్తున్నాం
CSR పేరుతో చెరువులను అక్రమించుకోడానికి ప్రయత్నం చేశారు
అన్ని సాంకేతిక ఆధారాలతో చెరువుల FTL మార్క్ చేస్తున్నాం
చెరువులతోపాటు నాలాలను నోటిఫై చేస్తున్నాం: రంగనాథ్
చెరువుల వద్ద భూముల ధరలకు కోట్లు పలుకుతున్నాయి: రంగనాథ్
-
Aug 23, 2025 12:18 IST
ఢిల్లీ: అనిల్ అంబానీ నివాసాల్లో మరోసారి CBI సోదాలు
మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ ఆఫీసుల్లో సోదాలు
ఆర్‌కామ్ కంపెనీల్లో CBI అధికారుల తనిఖీలు
అనిల్ అంబానీపై FIR నమోదు
యస్ బ్యాంకు నిధులను డొల్ల కంపెనీలకు.
మళ్లించారని అనిల్ అంబానీపై అభియోగం
-
Aug 23, 2025 11:48 IST
హైదరాబాద్: సీఎం రేవంత్ నివాసంలో కీలక సమావేశం
పాల్గొన్న మీనాక్షి, మహేష్‌గౌడ్, భట్టి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్
పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ
పీఏసీ, టి.పీసీసీ అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ
-
Aug 23, 2025 11:19 IST
నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
రౌడీషీటర్ శ్రీకాంత్ తండ్రి అడినందుకే పెరోల్ కోసం లేఖ ఇచ్చా
నేను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
పెరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వకంగా చెప్పారు: ఎమ్మెల్యే కోటంరెడ్డి
ప్రజాప్రతినిధులుగా చాలామందికి లేఖలు ఇస్తుంటాం
గతంలో శ్రీకాంత్ పెరోల్ కోసం చెవిరెడ్డి, కిలివేటి లేఖలు ఇచ్చారు
నేను ఇక ఎవరికీ పెరోల్ లేఖలు ఇవ్వను: ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Aug 23, 2025 10:50 IST
నెల్లూరు: మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కంపెనీలో సైబర్ మోసం
పునీత్ పేరుతో అకౌంటెంట్‌కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్
అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ మెసేజ్
డబ్బులు పంపిన అకౌంటెంట్
మోసపోయినట్టు గుర్తించి పీఎస్‌లో ఫిర్యాదు
యూపీకి చెందిన సైబర్ నేరగాళ్లు సంజీవ్, అరవింద్ అరెస్ట్
-
Aug 23, 2025 10:50 IST
హైదరాబాద్: సరూర్‌నగర్ అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు అరెస్ట్
సీఐడీ అదుపులో విశాఖకు చెందిన అనస్తీషియా డా. వెంకటరామ సంతోష్
ప్రతి ఆపరేషన్‌కు రూ. 2.5 లక్షలు తీసుకున్న డాక్టర్ సంతోష్
ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Aug 23, 2025 10:48 IST
కర్ణాటక: ధర్మస్థల కేసులో కీలక మలుపు
ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు భీమాను అరెస్ట్ చేసిన సిట్
అనేక మృతదేహాలను ఖననం చేశానంటూ...
15 రోజులుగా ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదారి పట్టించాడని అరెస్ట్
మాయమాటలతో వ్యవస్థను నమ్మించి చివరకి ఏమీ తెలియదని..
చేతులు ఎత్తేసిన పారిశుద్ధ్య కార్మికుడు భీమా
భీమాను ప్రశ్నిస్తున్న సిట్ అధికారి ప్రణబ్ మహంతి
-
Aug 23, 2025 10:47 IST
పుతిన్- జెలెన్‌స్కీని ఒకే టేబుల్ వద్ద కూర్చోబెట్టడమంటే..
ఆయిల్–వెనిగర్ కలపడమంత కష్టం: ట్రంప్
రష్యా ఇంకా ఓవర్‌యాక్షన్ చేస్తే మరిన్ని ఆంక్షలు విధిస్తాం: ట్రంప్
పుతిన్–జెలెన్‌స్కీలు ఉప్పు-నిప్పు టైప్: ట్రంప్
నేనొక పక్క శాంతి చర్చలు జరపుతుంటే.. యుద్ధం కొనసాగిస్తున్నారు
ఇప్పటి వరకు నేను 7 యుద్ధాలు ఆపాను: ట్రంప్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మాత్రం పరిష్కారం కావడం లేదు
రష్యా ఇంకా అతి చేస్తే వారి క్రూడ్ ఆయిల్‌పై 25-50 శాతం సుంకం వేస్తా: ట్రంప్
-
Aug 23, 2025 10:46 IST
నేను BRSలోనే ఉన్నా: MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
పార్టీ మారలేదు, నోటీసులకు సమాధానం ఇస్తాం: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా: బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
-
Aug 23, 2025 10:46 IST
హైదరాబాద్: BRS ఫిర్యాదుపై స్పీకర్ నోటీసులు
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
సుప్రీం తీర్పు మేరకు విచారణ చేపట్టనున్న స్పీకర్
బీఆర్‌ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం
-
Aug 23, 2025 10:04 IST
రాజస్థాన్: కోట, సవాయ్ మాధోపూర్, బుండి జిల్లాల్లో వరదలు
9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
సహాయక చర్యల్లో NDRF, SDRF బృందాలు
బుండిలోని నైన్వాన్‌లో 13 సెం.మీ వర్షపాతం
-
Aug 23, 2025 09:57 IST
ఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది: కేంద్రం
టిక్‌టాక్‌ను అన్‌బ్లాక్ చేసేలా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్న కేంద్రం
-
Aug 23, 2025 09:48 IST
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
టోల్‌ప్లాజాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ఫ్రీ
అన్ని టోల్‌ప్లాజాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు
-
Aug 23, 2025 09:24 IST
ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్
చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్, పలువురు గల్లంతు
-
Aug 23, 2025 09:24 IST
హైదరాబాద్: చిన్నారి సహస్ర హత్య కేసు
నిందితుడిని అబ్జర్వేషన్ హోంకు తరలించిన పోలీసులు
కాసేపట్లో జువైనైల్ కోర్టులో బాలుడిని హాజరుపర్చనున్న పోలీసులు
వైద్య పరీక్షల తర్వాత బాలుడిని జువైనైల్ హోంకు తరలింపు
-
Aug 23, 2025 09:23 IST
హైదరాబాద్: సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్‌స్ట్రక్షన్
మ.12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్‌మీట్
సహస్ర హత్య కేసు వివరాలు వెల్లడించనున్న డీసీపీ
-
Aug 23, 2025 08:43 IST
జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్‌కు భారీ వర్ష సూచన
హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్‌కు భారీ వర్ష సూచన
మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
భారీ వర్షాలతో రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
-
Aug 23, 2025 08:16 IST
ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనలు ఖరారు
ఈనెల 29, 30న జపాన్‌లో పర్యటించనున్న మోదీ
15వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరు
ఈనెల 31, సెప్టెంబర్ 1న చైనాలో ప్రధాని మోదీ పర్యటన
SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
Aug 23, 2025 08:14 IST
అమెరికా: పెంబ్రోక్ దగ్గర టూరిస్ట్ బస్సు బోల్తా, ఐదుగురు మృతి
ప్రమాద సమయంలో బస్సులో 54 మంది ప్రయాణికులు
నయాగరా నుంచి న్యూయార్క్ వెళ్తున్న టూరిస్ట్ బస్సు
-
Aug 23, 2025 06:48 IST
సురవరం సుధాకర్‌రెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్పనాయకుడు: సీఎం రేవంత్
గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటు: సీఎం రేవంత్
ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారు: సీఎం రేవంత్
నల్లగొండ జిల్లా నుంచి జాతీయస్థాయి నేతగా ఎదిగారు: సీఎం రేవంత్
-
Aug 23, 2025 06:16 IST
అమరావతి: నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
పెద్దాపురంలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛతా రథాలను పరిశీలించనున్న చంద్రబాబు
పెద్దాపురం పూర్ణ కళ్యాణమండపం దగ్గర క్యాడర్ మీటింగ్ నిర్వహణ
సా.5:30 గంటలకు నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
-
Aug 23, 2025 06:16 IST
హైదరాబాద్: ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం
మ.2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ