Home » Trains
దీపావళి పండుగ రద్దీని నివారించే నిమిత్తం నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ టిక్కెట్లు బుకింగ్స్ సోమవారం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో బుకింగ్ విండో ప్రారంభించగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా ఫుల్ అయ్యాయి.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12604)కు నాయుడుపేట్‌లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ఓ మెట్రో రైల్లోప్రయాణికులు రద్దీగా ఉంటారు. ఈ సమయంలో వారి మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిలబడి ఉన్న ఓ యువకుడు పొరపాటున అదుపుతప్పి తూలి పక్కన ఉన్న యువతిపై పడ్డాడు. దీంతో ఆమె అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్‌లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.
అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.
మెట్రో రైల్లో ఓ యువకుడు డోరు వద్ద నిలబడి ఉన్నాడు. ఎక్కి, దిగే వారికి అడ్డుగా నిలబడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. స్టేషన్ రాగానే ఓ వ్యక్తి దిగేందుకు ప్రయత్నించగా.. చేయి అడ్డుపెట్టి అతన్ని దిగకండా చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తెలిసిందే. రోడ్లు ఎంత విస్తరించినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. అందుకే కొన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించారు. అయితే 125 ఏళ్ల క్రితమే జర్మనీలో భిన్నమైన రైలు సర్వీసును ప్రారంభించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
రాబోయే పండుగ సీజన్‌కు ముందే మీరు ఇంటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? భారత రైల్వే మీ కోసం అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చింది. మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, చౌకగా మారుస్తూ, రైల్వే ప్రత్యేకంగా రౌండ్ ట్రిప్ ప్యాకేజీ స్కీమ్‌ను ప్రకటించింది.
భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది.తూర్పు మధ్య రైల్వేకు చెందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (DDU డివిజన్) నుంచి దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’ను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పింది. 354 వ్యాగన్లు.. 7 ఇంజిన్లు ఉన్న ఈ గూడ్స్ రైలు పొడువు ఏకంగా 4.5 కి.మీ. ఆసియాలోనే అత్యంత పొడవైన ఈ రైలు గురించి మరిన్ని విశేషాలు..