Share News

Kondapalli Railway Station: పలు రైళ్లకు కొండపల్లి హాల్ట్‌ తాత్కాలిక తొలగింపు

ABN , Publish Date - Aug 26 , 2025 | 08:36 AM

దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్‌ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.

Kondapalli Railway Station:  పలు రైళ్లకు కొండపల్లి హాల్ట్‌ తాత్కాలిక తొలగింపు

హైదరాబాద్‌ సిటీ: దక్షిణమధ్యరైల్వే పరిధిలో విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొండపల్లి రైల్వేస్టేషన్‌(Kondapalli Railway Station)లో ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నందున హాల్ట్‌ తొలగింపు నిర్ణయం తీసుకున్నారు.


ప్రధానంగా మచిలీపట్నం - విజయవాడ, బీదర్‌ వెళ్లే మచిలీపట్నం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-సికింద్రాబాద్‌(Guntur-Secunderabad) మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-అదిలాబాద్‌ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, విజయవాడ-భద్రాచలం , విజయవాడ- డోర్నకల్‌ మధ్య నడిచే మెమూ ప్యాసింజర్‌ రైళ్లకు అక్టోబర్‌ 19నుంచి నవంబర్‌ 18వరకు కొండపల్లి స్టేషన్‌లో హాల్ట్‌ను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు.


city1.3.jpg

మారిన 2 ప్యాసింజర్‌ రైళ్ల వేళలు

కాచిగూడ-మిర్యాలగూడ మెమూ(Kacheguda-Miriyalaguda Memo) (67775) ప్యాసింజర్‌ రాత్రి 7.30గంటలకు బదులు ఇకపై 7.40గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే, కాచిగూడ-వాడి మధ్య నడిచే మెమూ(67786) ప్యాసింజర్‌ కాచిగూడ నుంచి రాత్రి 7.35గంటలకు బదులుగా పది నిమిషాలు ముందుకు మారిందని, 7.25గంటలకు బయల్దేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచే ఈ మార్పు అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 26 , 2025 | 08:36 AM