Chennai News: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:28 AM
కోవై జిల్లా ఆవారంపాళ్యంలో రైలును కూల్చివేయాలనే సంఘ విద్రోహులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే త్రివేడ్రం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోవై జిల్లాలోని ఆవారంపాళ్యం దాటిన సమయంలో పట్టాలపై సిమెంటు రాళ్లు పెట్టిన విషయం తెలిసింది.
- రైలు పట్టాలపై రాళ్లు
- ఆవారంపాళ్యంలో పోలీసుల విచారణ
చెన్నై: కోవై జిల్లా ఆవారంపాళ్యంలో రైలును కూల్చివేయాలనే సంఘ విద్రోహులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే త్రివేడ్రం-చెన్నై ఎక్స్‌ప్రెస్ కోవై జిల్లాలోని ఆవారంపాళ్యం(Avarampalyam) దాటిన సమయంలో పట్టాలపై సిమెంటు రాళ్లు పెట్టిన విషయం తెలిసింది. రైలు చక్రాలు ఎక్కడంతో సిమెంట్ రాళ్లు ముక్కలయ్యాయి.

అయితే రైలుకు ఎలాంటి నష్టం జరగలేదు. సమాచారం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్ బలగాలు రైలు పట్టాలపై సిమెంట్ రాళ్లను పెట్టింది ఎవరు? ఒకవేళ రైలును కూల్చడానికి చేసిన కుట్రా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News