Special Trains: బిలాస్పూర్-యల్హంక మధ్య ప్రత్యేక రైలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:33 AM
దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు(అనంతపురం): దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని సెప్టెంబరు 9 నుంచి నవంబరు 19 వరకూ బిలాస్ పూర్-యల్హంక (వయా గుంతకల్లు) మధ్య ఓ ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బిలా్‌సపూర్-యల్హంక ప్రత్యేక రైలు (08261) సెప్టెంబరు 9 నుంచి నవంబరు 18 వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11 గంటలకు బిలా్‌సపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు యల్హంకకు చేరుతుందన్నారు.
దీని తిరుగు ప్రయాణపు రైలు (08262) సెప్టెంబరు 10 నుంచి నవంబరు 19 వరకూ ప్రతి బుధవారం ఉదయం రాత్రి 9 గంటలకు యల్హంకలో బయలుదేరి శుక్రవారం ఉదయం ఐదున్నరకు బిలా్‌సపూర్‌కు చేరుకుంటుందన్నారు. ఈ రైలు భటపర, రాయపూర్, దుర్గ్, రాజనంద్‌గావ్, డోంగర్‌ఘర్, గోండియా, వాడ్సా, చంద ఫోర్ట్, బాలార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, ఖాజీపేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, క్రిష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, గుంతకల్లు, గుత్తి, అనంతపురరం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా యల్హంకకు చేరుతుందన్నారు.
ప్యాసింజరు రైళ్ల రద్దు
కర్ణాటకలోని బళ్లారి, తోరణగల్లు స్టేషన్ యార్డుల్లో జరుగుతున్న ఎలెక్ట్రికల్, సిగ్నలింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్ పనుల వల్ల గుంతకల్లు మీదుగా వెళ్లే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు పరచినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు-చిగ్జాజుర్-గుంతకల్లు ప్యాసింజరు (57415/16) రైలును సెప్టెంబరు 3న రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు
తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (57405)ను సెప్టెంబరు 2న, దీని తిరుగు ప్రయాణపు రైలు (57405)ను సెప్టెంబరు 3న గుంతకల్లు-కదిరిదేవరపల్లి సెక్షన్‌లో రద్దుపరచి, కేవలం గుంతకల్లు-తిరుపతి మధ్యన నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హుబ్లి-గుంతకల్లు ప్యాసింజరు (56911) రైలును, దీని తిరుగు ప్రయాణపు రైలు (56912)ను సెప్టెంబరు 3న గుంతకల్లు-మునీరాబాద్ సెక్షన్‌లో రద్దుపరచి, మునీరాబాద్-హుబ్లి సెక్షన్‌లో మాత్రమే నడుపుతామన్నారు. హుబ్లి-తిరుపతి (57402) ప్యాసింజరును సెప్టెంబరు 3న గంటన్నరపాటు ఆలస్యంగా నడపనున్నట్లు వివరించారు.

నాందేడ్-ధర్మవరం రైలు రద్దు
హైదరాబాద్ రైల్వే డివిజన్‌లో వర్షపు నీరు ట్రాక్‌పై ప్రవహించిన కారణంగా నాందేడ్-ధర్మవరం-నాందేడ్ స్పెషల్ ఫేర్ ఎక్స్‌ప్రె్‌సను ఒక ట్రిప్పు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాందేడ్-ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (07189) రైలును 29న దీని తిరుగు ప్రయాణపు రైలు (07190)ను ఈ నెల 31న రద్దుపరచినట్లు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News