Home » Trains
వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్ ఇంజన్, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.
ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్ అప్ అండ్ డౌన్ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి చెన్నై బీచ్ స్టేషన్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
ఓ వ్యక్తి టికెట్ లేకుండా లోకల్ రైలు ఎక్కేశాడు. మధ్యలో టీటీఈ తనిఖీకి రావడంతో అనూహ్యంగా పట్టుబడ్డాడు. దీంతో అతడికి టీటీఈ ఫైన్ వేసింది. ఆమె ఫైన్ రాయడంతో సదరు ప్రయాణికుడు తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఆమెతో మాట్లాడుతూ ఏమన్నాడంటే..
మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్‌కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వరంగల్, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.