Home » Tirupati
తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.
తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్ తోమాల. అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్. ఈమెది టెక్సాస్. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.
న్యూటన్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.
అనుకూలమైన వాతావరణ పరిస్థితులతో ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడిపూత పుష్కలంగా వచ్చిందని రిటైర్డ్ ఏడీఏ, సాగు సలహాదారు మెరుగు భాస్కరయ్య పేర్కొన్నారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావడం, పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని నటుడు చరణ్‌రాజ్ అన్నారు.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్‌ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
రేణిగుంటలో ఓ యువకుడు నడిరోడ్డుపై కత్తితో గొంతు కోసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్ ఇంజన్, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.
శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో పలు శైవక్షేత్రాలకు జిల్లాలోని వివిధ డిపోల నుంచి 146 ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి.