Kidnapping Case: తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. చేజ్ చేసిన పోలీసులు.. చివరకు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:04 AM
ఓ కారులో విలన్లు మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం.. వెనుకే పోలీసు వాహనం వెంటపడడం.. వంటి సీన్లు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఇలాంటి సీన్లు తలదన్నే సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటాయి. తాజాగా, తిరుపతిలో ఏం జరిగిందంటే..
విలన్లు మహిళలను కిడ్నాప్ చేయడం.. వారి వాహనానలు పోలీసులు వెంబడించడం వంటి సంఘటనలు సినిమాల్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆపదలో ఉన్న వారిని కాపాడి.. అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు పోలీసులు. తాజాగా, తిరుపతిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ రౌడీషీటర్ తల్లీకూతురును కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ.. ఆ వాహనాన్ని వెంబడించాడు. చివరకు ఏమైందంటే..
తిరుపతి: నగరంలోని లక్షిపురం సర్కిల్ వద్ద రౌడీషీటర్ అజీజ్, అతని అనుచరుడు బబ్లు హల్చల్ చేశారు. తల్లి , కూతురును కారులో కిడ్నాప్ చేసిన రౌడీషీటర్.. మాట వినకపోతే చంపేస్తా అంటూ కత్తులతో బెదిరించాడు. వారిని కారులో తీసుకెళ్తుండగా.. సదరు మహిళ తన భర్తకు లోకేషన్ షేర్ చేసింది. లోకేషన్ చూసిన భర్త.. పోలీసులకు సమాచారం అందించాడు.
శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న అలిపిరి సీఐ రామకిషోర్ బృందం.. రౌడీ షీటర్ కారు చేజ్ చేశారు. కొర్లగుంట వద్ద పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రౌడీ షీటర్.. రెండు కార్లు, ద్విచక్ర వాహనాలను ఢీ కొడుతూ భయబ్రాంతులకు గురి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. చివరకు సీఐ రాంకిషోర్ బృందం.. సినీ తరహాలో వెంబడించి వారిని పట్టుకున్నారు. తల్లీకూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చి, రౌడీషీటర్ అజీజ్, అతడి అనుచరుడు బబ్లును అదుపులోకి తీసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు రౌడీ షీటర్ గతంలో కూడా పలు కేసుల్లో అరెస్టయి జైలు జీవితం గడిపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కిడ్నాప్ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు
Read Latest Andhra Pradesh News and National News