Home » Tirumala
లడ్డూ ధరల పెంపు వార్తలను టీటీడీ ఛైర్మన్ తీవ్రంగా ఖండించారు. కావాలనే కొన్ని ఛానళ్లు పని గట్టుకొని టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్షకుమార్ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్లోని టీటీడీ ఆలయంలో గురువారం 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆయన విడుదల చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది.
తిరుపతిలో వరస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నగరంలో ఇటీవల నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపిన కేటుగాళ్లు.. తాజాగా మరోసారి అదే తరహాలో వ్యవహరించారు.
తిరుమల వెళ్లే భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలను రోడ్డుపై విసిరేశారని తెలిపింది.
కానుకల ద్వారా రూ.25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవోపేతంగా సాగుతున్న ఉత్సవాల్లో లక్షలాది భక్తులు..
తిరుమల శ్రీవారు మంగళవారం ఉదయం సూర్యప్రభమీద ఊరేగిన స్వామి, రాత్రి చంద్రప్రభపై విహరించాడు.
బ్రహ్మోత్సవాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఉత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడ సేవను టీటీడీ ఎంతో అద్భుతంగా నిర్వహించిందని.. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి అన్నారు.
ఏడుకొండల మీద అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న గరుడోత్సవం ప్రతి సంవత్సరం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేస్తోంది.