Tirumala: పట్టువస్త్రాలు కాదు పాలిస్టర్.. తిరుమలలో మరో భారీ స్కామ్
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:00 PM
టీటీడీలో ఇటీవల వెలుగుచూసిన పట్టువస్త్రం స్కామ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నకిలీ పట్టు దుపట్టాకు సంబంధించి రూ.54 కోట్ల మోసం బయటపడిందని మీడియా వేదికగా వెల్లడించారాయన.
తిరుపతి, డిసెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇటీవల వెలుగుచూసిన పట్టు దుపట్టా కుంభకోణం(Dupatta Scam)పై.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) స్పందించారు. మల్బరీ పట్టు వస్త్రాలకు బదులుగా.. పాలిస్టర్ వస్త్రాలు సరఫరా అయ్యాయనే విషయమై.. ఏసీబీ(ACB) అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు.
'టీటీడీలో మరో స్కామ్.. రూ.54 కోట్ల నకిలీ పట్టు దుపట్టా మోసం బయటపడింది. ఈ విషయమై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఏదైనా దేవస్థానంలోకి వెళితే.. మీకు కొంత దుష్ప్రవర్తన కనిపిస్తుంది. పరకామణి(Parakamani) విషయంలో చాలామంది చట్ట విరుద్ధంగా వ్యవహరించారు. టీటీడీలో ఎప్పటినుంచో కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చేశారు. ఇప్పుడు వెలుగులోకి రావడానికి ఏకైక కారణం.. మనకు బలమైన టీటీడీ బోర్డు, ప్రభుత్వం ఉండటమే. నేడు మనందరికీ ముఖ్యమంత్రి నుంచి మార్గదర్శకత్వం ఉంది. సరైన ప్రణాళికులతో ముందుకు సాగుతున్నాం. గతంలో మేము పుకార్లను మాత్రమే విన్నాం. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ఏం చేశారో? నిజం తెలుస్తుంది. భారతదేశంలోని ఇతర మతాలతో( Religion) పోలిస్తే.. ప్రభుత్వ చర్యలు, బహిరంగ ప్రకటనలకు సంబంధించి హిందువులను అవమానంగా చూస్తున్నారు. నేను గతంలో చెప్పినట్లుగా హిందువులను లక్ష్యంగా చేసుకుని నిలదీస్తున్నారు' అని పవన్ చెప్పారు.
ఎక్కడుంది మెజారిటీ.?
రాజ్యాంగం(Constitution), చట్టం(Law) రెండువైపులా ఉండేలా విధిగా పనిచేయాలనేదే తన అభిప్రాయమని పవన్ తెలిపారు. ముస్లిం(Muslim) లేదా క్రైస్తవ(Christian) ప్రయోజనాలను కాపాడటానికి కొన్ని నిబంధనలు వర్తింపజేస్తే.. అవి హిందువులకూ సమానంగా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. హిందువులు(Hindu) మెజారిటీ అనే ఆలోచన.. తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు అవుతాయని పేర్కొన్నారు.
'మెజారిటీ ఎక్కడ ఉంది? హిందువులు.. కులం, భాష, ప్రాంతం ద్వారా విభజన చెందారు. దేవాలయానికి వెళ్లి చేతులు జోడించేవారు, సనాతన ధర్మాన్ని విశ్వసించే ఎవరైనా.. బుజ్జగింపు రాజకీయాలను ఆచరించే నాయకులకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను వినిపించాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారం కోసం ఒక సమస్యలాగా మాట్లాడారు. కానీ.. తన సొంత మతమైన క్రైస్తవ మతం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ధైర్యం చేస్తారా? హిందువులను లక్ష్యంగా చేసుకోవడం అందరికీ సులభంగా మారింది. ఐదు సంవత్సరాలకు పైగా సీఎంగా పనిచేసిన వ్యక్తిగా.. ఆయన అలాంటి ప్రకటనలు చేయకూడదు. తమిళనాడులోని ఆలయ వ్యవహారాల్లో డీఎంకే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగంలో మొదట చేతితో రాసిన ముసాయిదాలో భగవద్గీతను గురించి ప్రస్తావించారు' అని డిప్యూటీ సీఎం అన్నారు.
ఇవీ చదవండి: