Home » Thummala Nageswara Rao
జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
ప్రపంచ వాణిజ్యానికి తెలంగాణ చిరునామాగా నిలుస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక సంస్థల కుర్చీల్లో కూర్చోవాలని, అందుకోసం పార్టీ శ్రేణులు కష్టపడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. త్వరలో జగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఒక ఎకరం వరకు భూమి ఉన్న మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు.
Minister Thummala Nageshwar Rao: ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు సాయం అందజేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.7,625 కోట్ల రుణమాఫీ సొమ్మును ఒకే ఒక్క రాత్రి రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని నేతలు గ్రామసభలకు అడ్డుతగులుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు.
యాసంగి సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.