Share News

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:58 AM

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ అనుచరుడి పాడె మోశారు. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడు, సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వంచారు.

అనుచరుడి పాడె మోసిన తుమ్మల

సత్తుపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ అనుచరుడి పాడె మోశారు. ఖమ్మం జిల్లాలో సీనియర్‌ రాజకీయ నాయకుడు, సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యుడు గాదె సత్యనారాయణ శుక్రవారం మృతి చెందగా శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వంచారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మంత్రి తుమ్మల సత్తుపల్లిలోని సత్యనారాయణ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్న పలువురు నాయకులు శనివారం ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పించారు.

Updated Date - Mar 02 , 2025 | 04:58 AM