Share News

Tummala: సేవాలాల్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

ABN , Publish Date - Feb 16 , 2025 | 04:15 AM

జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala: సేవాలాల్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం

  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రఘునాథపాలెం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జంతుబలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్య పరిచిన నేత సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సంత్‌సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంత్‌సేవాలాల్‌కు తుమ్మల ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయానికి భూమిపూజ చేశారు.


ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ సంత్‌సేవాలాల్‌ స్ఫూర్తితో బంజారాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు సాగారని.. విద్యా, వైద్యం, ఐటీ వంటి రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని విధాలుగా బంజారాలను ఆదుకుంటుందని తెలిపారు. బంజారాలు ఆధునిక వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని, ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించారు.

Updated Date - Feb 16 , 2025 | 04:15 AM