Home » TG News
ఫామ్‌ల్యాండ్ వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తూ.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది.
నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద కృష్ణా జలాలు రంగు మారాయి. ఆయా ప్రాజెక్టుల్లోని నీళ్లు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
మహాత్మా గాంధీ చరిత్రను వక్రీకరిస్తూ గాడ్సేను స్మరించుకునే దౌర్భాగ్య పరిస్థితులు నేడు దేశంలో దాపురించాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ప్రియుడి వద్ద ఉన్న తన బంగారు గొలుసును తీసుకునేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఓ హోటల్ రూములో శవమై కనిపించింది.
ఎన్నో కష్టనష్టాలు ఓర్చి సాగు చేసుకున్న పంటను జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలే ఆ రైతు దంపతుల పట్ల యమపాశాలయ్యాయి.
ప్రాంతాల వారీగా స్థానిక అలవాట్లకు అనుగుణంగా విద్యార్ధులకు బ్రేక్‌ఫాస్ట్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హరే కృష్ణా ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికాలో ఐదేళ్లు నౌకరీ చేస్తే మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లు, 100 ఎకరాల్లో ఫాం హౌస్ ఎలా వస్తాయని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి నిలదీశారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు పనుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తొలి టెండర్‌ను ఖరారు చేసి.. కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది.
రైతాంగానికి కొత్త సాంకేతికతలను అందించి... వారు అధిక దిగుబడులతో స్థిర ఆదాయం పొందేలా కృషి చేయాలని... ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు, మాజీ హవల్దార్ మల్లేశ్‌కు.. ఆయుధాల అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది