ప్రజా పాలన ఫలితమే ఈ విజయం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - Feb 13 , 2026 | 07:09 PM
తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని.. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనమని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద- మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని అన్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు రేవంత్. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితం అవుతామన్నారు. భవిష్యత్‍లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడకండి.. గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేటీఆర్
కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు