Home » test cricket
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాను ఇప్పుడు ఓవర్ రేట్ ఉచ్చు వెంటాడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన ఆసీస్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. మూడో రోజు కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో(16.1 ఓవర్) కమిందు మెండిస్(14) ఇచ్చిన క్యాచ్‌ను గిల్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
భారత టెస్టు జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు. అయితే జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. రీఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కఠోర శ్రమనే ఉంది. ఏడాదిన్నరగా కశ్మీర్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ.. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు.
శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయపడటంపై వస్తోన్న విమర్శలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో సీఓఈపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.
15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సంచలనాలు సృష్టిస్తున్న యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు.
భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా 12వ ప్లేయర్‌గానే కొనసాగానని తెలిపాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ అత్యంత కీలకం కానుంది. మరి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే సమీకరణాలు ఇలా..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.