Share News

అఫ్గాన్‌-భారత్ ఏకైక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:19 PM

ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.

అఫ్గాన్‌-భారత్ ఏకైక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట
India vs Afghanistan Test

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్థాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. భారత్‌పై అఫ్గాన్ ఇంకా 451 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో రెహమత్ షా(43*) ఉన్నాడు. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 3 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు.


అంతకుముందు ఓవర్‌నైట్ 368/3 స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 564 పరుగుల స్కోర్ చేసింది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. కేఎల్ రాహుల్(100), శుభ్‌మన్ గిల్(126) సెంచరీలతో చెలరేగారు. సాయి సుదర్శన్(81), రిషభ్ పంత్(81), వాషింగ్టన్ సుందర్(52*) హాఫ్ సెంచరీలు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో విజృంభించాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిది తలొక వికెట్ పడగొట్టారు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. అబ్దుల్ మాలిక్(16), సెదికుల్లా అటల్(17), రెహమానుల్లా గుర్బాజ్(12), హష్మతుల్లా షాహిది(20), అఫ్సర్ జాజై(3) వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు.


ఇవి కూడా చదవండి:

టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jun 07 , 2026 | 05:21 PM