అఫ్గాన్‌తో ఏకైక టెస్టు: తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:57 PM
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో టీమిండియా ముల్లాన్‌పూర్ వేదికగా తలపడుతోంది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో టీమిండియా ముల్లాన్‌పూర్ వేదికగా తలపడుతోంది. ఓవర్‌నైట్ 368/3 స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 197 పరుగులు జోడించింది. 127 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 564 పరుగులు వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆధిపత్యం చెలాయించిన భారత బ్యాటర్లు.. రెండో రోజు అదే దూకుడును కొనసాగించలేకపోయారు. వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(100), శుభ్‌మన్ గిల్(126) సెంచరీలు చేశారు.
యశస్వి జైస్వాల్(24), కేఎల్ రాహుల్(100), సాయి సుదర్శన్(81) తొలి రోజే ఔటయ్యారు. రెండో రోజు గిల్(126), రిషభ్ పంత్(81), ధ్రువ్ జురెల్(19), మానవ్ సుతార్(28), సిరాజ్(22) పెవిలియన్‌కు చేరారు. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి క్రీజులో వాషింగ్టన్ సుందర్(52*), కుల్‌దీప్ యాదవ్(9*) ఉన్నారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్