Share News

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:26 PM

భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నిర్ణయిస్తూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్‌లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు.

టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer

ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నిర్ణయిస్తూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. రానున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ 2026కు టీమిండియాకు అయ్యర్‌ నాయకత్వం వహించనున్నాడు. అయితే కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారిగా స్పందించాడు. ముంబై టీ20 లీగ్‌లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు. ఈ మేరకు బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపాడు.


‘నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐకు కృతజ్ఞతలు. దేశానికి నాయకత్వం వహించే అవకాశం రావడం గర్వకారణం. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం మరింత ఆనందంగా ఉంది. కేవలం పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్సీ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చడం ‘ఐసింగ్ ఆన్ ది కేక్’లా అనిపిస్తోంది. ఇన్నేళ్లుగా అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతు అమోఘం. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని అయ్యర్ తెలిపాడు.


కెప్టెన్సీ మార్పుపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘సూర్యకుమార్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం సులభమైన నిర్ణయం కాదు. వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అన్ని ఫార్మాట్లలో స్థిరమైన ప్రదర్శనతో పాటు నాయకత్వ లక్షణాలను పరిగణనలోకి తీసుకుని అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాం’ అని వెల్లడించాడు.


ఇవీ చదవండి:

అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ ఎంపికపై బీసీసీఐ స్పందనిదే..

కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..

Updated Date - Jun 07 , 2026 | 12:26 PM