టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:19 PM
టీజీ టీ20 లీగ్ వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు జాక్‌పాట్ తగిలింది. రూ.5లక్షల బెస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని.. మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలోని యువ క్రికెటర్లలో ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీజీ టీ20)ను ఆరంభించిన సంగతి తెలిసిందే. నేడు లీగ్‌లో భాగమైన ఎనిమిది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేయడం కోసం వేలాన్ని చేపట్టాయి. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకు జాక్‌పాట్ తగిలింది. రూ.5లక్షల బెస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని.. మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజీ భారీ ధరకు కొనుగోలు చేసింది.
తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్, నల్గొండ నైట్స్ పోటీ పడ్డాయి. చివరకు తిలక్ వర్మను రూ.33 లక్షలకు మెదక్ జట్టు సొంతం చేసుకుంది. దాంతోపాటు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కొడుకు చామ మిలింద్ ఆనంద్ కూడా భారీ ధర పలికాడు. రూ.5లక్షల బెస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని.. అన్విత ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజీ రూ.17 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. మరోవైపు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ అమన్ రావు పేరాలను రూ.12 లక్షలకు వరంగల్ వారియర్స్ సొంతం చేసుకుంది.
ఈ టీజీ టీ20 లీగ్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు సాగే లీగ్‌లో 32 మ్యాచ్‌లుంటాయి. అయితే ఈ టోర్నీ మొత్తం మ్యాచ్‌లకు తిలక్ వర్మ, సిరాజ్ అందుబాటులో ఉండే అవకాశం దాదాపుగా లేదు. ఎందుకంటే అదే సమయంలో భారత జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. కాగా టీజీ టీ20 లీగ్ మ్యాచ్‌లన్నీ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి సీజన్ వేలం కోసం 1,300 మందికి పైగా ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేవలం 160 మంది ప్లేయర్లను మాత్రమే షార్ట్‌లిస్ట్ చేసింది.
ఇవీ చదవండి:
అతడో గేమ్ ఛేంజర్.. వైభవ్ ఎంపికపై బీసీసీఐ స్పందనిదే..
కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..