Home » Telangana
సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంను కాకముందు చాలా మందిపై.. గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని అన్నారు...
ప్రభుత్వ పాఠశాలల్లో నెల రోజుల్లో బోధన పద్ధతుల్లో మార్పులు కనిపించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అకాడమిక్ ప్యానెల్ బృం దాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్షించారు.
జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ సబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలలో సత్వరం వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ అన్నారు.
విద్యార్థులు సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి చూపాలని, ఆధునిక కాలంలో సైన్స్‌పై అవగాహన పెంచుకొని పరిశోధ నల వైపు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీపీసీ టీటీసీలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారం భించారు.
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తతతో నేరాలను అరికట్టాలని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మంగళవారం కమిషరేట్ కార్యాల యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యం లో ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ అనే కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల సైబర్ భద్రత ప్రచార కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు.
సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో అప్రమత్తంగా ఉండి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. సిర్పూర్(టి) మండలం సరిహద్దులోని వెంకట్రావుపేట- పోడ్సా వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టును మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల రాక పోకల రిజిస్టర్‌ను పరిశీలించారు.
రెండేళ్ల అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలుకాగా ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా రెండో విడత నామినేషన్ల పర్వం కూడా మంగళవారంతో ముగిసింది. ఇక పాలకవర్గాలు కొలువుదీరడమే తరువాయి. అయితే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇందుకోసం గ్రామపంచాయతీలకు ప్రధానంగా సొంత వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నిధులు వస్తాయి.
ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్‌రావులతో కలిసి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
కుమరం భీం జిల్లా కౌటాలలో ఓ వ్యాపారిని తపాకితో కాల్చి చంపేందుకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. కౌటాల పోలీసుస్టేషన్‌లో ఎస్పీ నితికా పంత్ మంగళవారం వివరాలు వెల్లడించారు
జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల గడవు ముగిసింది. దీంతో ఆయా పార్టీల నాయకులు తమ వర్గం వారిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి.. ఈ నానుడినే నాయకులు ఒంట పట్టించుకున్నారు.