kumaram bheem asifabad-విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:29 PM
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృమాలలో విద్యను అభ్యసిస్తున్త విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికకాహారం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంంలోని మోడి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు.
కెరమెరి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృమాలలో విద్యను అభ్యసిస్తున్త విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికకాహారం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మండలంంలోని మోడి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల హాజరు పట్టిక, తరగతి గదులు, వంట శాల, సరుకుల నిలువ గది, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. కేజీబీవీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి సిబ్బంది హాజరు పట్టిక, సరుకుల నిలువ, విద్యాబోధన తీరును పరిశీలించారు. ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని చెప్పారు. వంట శాల, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాల న్నారు. మండలంలోని పల్లె దావాఖానాను సందర్శించి ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య ఆసుప్రతిలో కల్పిస్తున్న సౌకర్యాలు, మందుల నిలువ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సామూహిక మరుగుదొడ్ల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిలువలు, పారిశుధ్యం నిర్వహణ అంశాలను సిబ్బదిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సావర్‌ఖేడ గ్రామంలో ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కెరమెరి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా సంక్షేమంలో భాగంగా నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతిమ పౌండేషన్ సహకారంతో బుధవారం ప్రతిమ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారు మూల గ్రామా ల్లో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలను చేసుకోవాలని చెప్పారు. అవసరమైన వారికి ప్రతిమ మెడికల్ సైన్స్‌స్ వారు శస్త్ర చికిత్సలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తారని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 2 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రతిమ పౌండేషన్ వారు మండలంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ శిబిరం నిర్వహణలో కెరమెరి సమాఖ్య ముందు కు రావడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, స్థానిక సర్పంచ్‌లు, ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు, వైద్యులు, సమాఖ్య సభ్యులు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.