kumaram bheem asifabad- సమస్యల స్వాగతం
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:27 PM
కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలక వర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యల పరిష్కారం, అభివృద్ది పనులు, అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి ఎజెండగా ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి గెలు పొందిన వార్డు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు కొలువు దీరిన నూతన పాలకవర్గా లకు స్వాగతం పలుకుతూ సవాలుగా నిలుస్తున్నాయి.
- మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తం
- అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీలు
- పలు కాలనీల్లో పొంచి ఉన్న నీటి ఎద్దడి
- కనీస సదుపాయాలు లేక ప్రజల ఇక్కట్లు
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలక వర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యల పరిష్కారం, అభివృద్ది పనులు, అర్హులకు సంక్షేమ పథకాల లబ్ధి ఎజెండగా ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి గెలు పొందిన వార్డు కౌన్సిలర్లుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు కొలువు దీరిన నూతన పాలకవర్గా లకు స్వాగతం పలుకుతూ సవాలుగా నిలుస్తున్నాయి. ప్రత్యేక అధికారుల పరిపాలనలో కేవలం పన్నుల వసూళ్లపైన దృష్టి సారించగా ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. పాలకవర్గాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను పరిష్కరించడమే కాకుండా మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడుపుతారనే ఆశతో పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
- జిల్లాలోని 50 వార్డుల్లో..
జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉండగా ఇందులో 50 వార్డులు ఉన్నాయి. ఆసిఫా బాద్‌లో 20 వార్డులు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు ఉండగా ఇటివల జరిగిన ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా గెలుపొందిన వారు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. కాగా రెండు మున్సిపాలిటీ వార్డుల్లో అనేక సమస్య లు తిష్ట వేశాయి. ప్రదానంగా డ్రైనేజీ నిర్మాణాలు లేకపోవడంతో కొన్ని వార్డుల్లో మురికినీరు రోడ్లపైనే నిల్వఉంటూ దుర్గంధం వెదజ ల్లుతోంది. ఆసిఫా బాద్ మున్సిపాలిటీ పరిధిలోని పైకాజీనగర్, కంఠ కాలనీ, బజారువాడి, సందీప్‌నగర్, కసాబ్‌వాడి, టీఆర్ నగర్, గోడవెల్లి, హీరాపూర్‌లలో డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సంజీవయ్య కాలనీ, మార్కెట్ ఏరియా, కాపువాడలలో డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో ఏటా వర్షకాలంలో వరదనీ రు ఇళ్లలోకి వచ్చి చేరుతుంటాయి. అలాగే కాలనీలలో చెత్తాచెదారం పేరుకుపోయి పారిశు ధ్యం అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాలిటీల్లో అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. తడిపొడి చెత్త సేకరణ కూడ సక్రమంగా నిర్వహించడంలేదు. వీధి దీపాలు వెలుగక రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ధ్వంసమైన అంతర్గత రోడ్లు, వేలాడుతున్న విద్యుత్ వైర్ల కారణంగా ఆయా కాలనీల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
- నీటి సరఫరాకు ఇక్కట్లు..
వేసవి కాలం సమిపిస్తుండడంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో నీటి ఎద్దడి పొంచి ఉంది. కాలనీలలో తాగునీటి పైపులైన్లు సరిగ్గా లేక నీటి సరఫరాకు ఇబ్బందిగా మారింది. కొన్ని కాలనీల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదని ప్రజలు వాపోతున్నారు. పైపులైన్లు ఎక్కడ పడితే అక్కడ లీకేజీ ఏర్పడటంతో నీరు వృధగా పోతున్నది. కొన్ని కాలనీలలో చేతి పంపుల పైనే ప్రజలు ఆదారపడా ల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎండలు ముదిరితే నీటి ఎద్దడి నెలకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు వీది కుక్కలు, కోతుల బెడద వెంటాడుతోంది. కోతులు గుంపులు గుంపు లుగా సంచరిస్తూ ఇళ్లలోకి చొరబడి వస్తువులను చిందర వందరగా చేస్తున్నాయి. మనుషులపైన దాడు లకు దిగుతున్నాయి. కోతుల దాడిలో పలువురు గాయప డిన ఘటనలు ఉన్నాయి. కాలనీల్లో వీది కుక్కలు బెడద నెలకొంది. ఉదయం, రాత్రి వేళల్లో గుంపు లుగా తిరుగుతూ మనుషులపై దాడులకు పాల్ప డుతున్నాయి. పలు సమస్యలు వార్డుల్లో తిష్ట వేయ డంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త పాలక వర్గాలకు వార్డుల్లో నెలకొన్న సమస్యలు సవాలుగా మారాయి.