Share News

kumaram bheem asifabad- నీడ కోసం నిరీక్షణ

ABN , Publish Date - Feb 18 , 2026 | 10:34 PM

జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మా ణం చేపట్టక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పదిహేను మండలాల పరిధిలో కేవలం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో బస్టాండ్‌లు ఉన్నాయి. మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన, కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండ్‌లు లేని కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు.

kumaram bheem asifabad- నీడ కోసం నిరీక్షణ
సిర్పూర్‌(టి)లో రోడ్డుపై బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

- మండుటెండలో రోడ్డుపైనే ప్రయాణికుల పడిగాపులు

సిర్పూర్‌(టి), ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మా ణం చేపట్టక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పదిహేను మండలాల పరిధిలో కేవలం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో బస్టాండ్‌లు ఉన్నాయి. మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన, కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండ్‌లు లేని కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. పెంచికలపేటలో చిన్న షెల్టర్‌ మాత్రమే ఉంది. ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంతో ఎండ లోనే నిలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బస్సు కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం ఎండలు ముదురుతున్నా యి. ప్రయాణికులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మండలకేంద్రాల్లో ఆర్టీసీ అధికారులు కనీస సదుపా యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు మండి పడుతున్నారు.

- ఇబ్బందులు పడుతున్నా..

పలు మండలాల్లో బస్టాండ్‌లు లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మండలాల్లో నుంచి నిత్యం వివిధ పనుల నిమిత్తం కాగజ్‌నగర్‌కు, కార్యాలయాల పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో చంటి పిల్లలతో కుటుంబసభ్యులు ఎండ లోనే వేచి చూడాల్సిన పరిస్థిఽతులు ఉన్నాయి. గతంలో కొన్ని చోట్ల బస్టాండ్‌ల నిర్మాణం కోసం పాలకులు భూమి పూజ చేసినప్పటికి ఇప్పటికీ పనులు ప్రారంభించ లేదు. రోడ్లపై నిలబడే వేచి ఉంటున్నారు. ఉన్నా కనీసం తాగడానికి మంచి నీరు సైతం దొరకని పరిస్థితి తలెత్తుతోంది. వర్షాకాలంలో వర్షాలకు తడుచుకుంటూ, చలికాలంలో చలికి వణుకుతు న్నారు. జిల్లాలో వివాహాల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వివాహాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇతర గ్రామాలకు వెళ్తున్న క్రమంలో ఎలాంటి సౌకర్యాలు లేక చంటి పిల్లల తల్లులు అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో నిలువ నీడలేక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.

- రోడ్లపైనే వేచి చూస్తూ..

సిర్పూర్‌(టి), బెజ్జూరు,, చింతలమానేపల్లి, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, తిర్యాణి వంటి మండలాల్లో బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్టాండు లేక ప్రయాణికులు హోటళ్లు, కిరాణ దుకాణాల ఎదుట నిలబడి బస్సు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. సిర్పూర్‌(టి) మండలంలోని లోనవెల్లి, చింతకుంట, హుడ్కిలి తదితర మారు మూల గ్రామాల నుంచి విద్యార్థులు కళాశాల, పాఠశాలకు రాక పోకలు సాగిస్తుంటారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముం దు గల బీసీ వసతి గృహం స్థలంలో బస్టాండు నిర్మాణానికి నిధులు కేటాయించింది. కానీ అధికా రులు, ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో ఆ స్థలం నేటి వరకు నిర్మాణం చేపట్టలేదు. ఆర్టీసీ అధికారులు కేవలం కొన్ని రోజులు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఒకటి రెండు రోజులు బస్సులను నిలిపి వేశారు. అనంతరం మళ్లీ పాత పద్ధతిలోనే రోడ్డుపై బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కిం చుకుంటున్నారు. బస్టాండుతో పాటు తాగునీటి వసతి లేక పోవడంతో ప్రయాణికులు అత్యవసర సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇటీవలే బస్టాండు ఏరియాలో సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి నప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో చిన్న పిల్లలు, మహిళలుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిదులు పట్టించుకోవ డం లేదని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 18 , 2026 | 10:34 PM