Share News

kumaram bheem asifabad- రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 10:32 PM

జిల్లాలోని ప్రతి రైతు నుంచి రైతు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌తో కలిసి మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలుతో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్‌, యాప్‌ ద్వారా యూరియా స్లాట్‌ బుక్కింగ్‌ అంశాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి రైతు నుంచి రైతు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌ రైతు వేదికలో జిల్లా వ్యవసాయాధికారి వెంకట్‌తో కలిసి మండల వ్యవసాయాధికారులు, ఏఈవోలుతో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్‌, యాప్‌ ద్వారా యూరియా స్లాట్‌ బుక్కింగ్‌ అంశాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు గుర్తింపు రిజిస్ట్రేషన్‌ కోసం వారు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలలని చెప్పారు. ఫార్మర్‌ ఐడీ ద్వారా ప్రభుత్వ పథకాలు, రాయితీ యంత్రాలు, పెట్టుబడివ సాయం, విత్తనాలు, ఎరువులు, ఇతర ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ఆ దిశగా వ్యవసాయాధికారులు కృసి చేయాలని తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన యాప్‌ పద్ధతి ద్వారా రైతులు ఎరువుల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకునేలా ప్రతి రైతుకు తెలియజేయాలని చెప్పారు. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రైతు భూమి వివరాలు, ఆధార్‌ కార్డు నకల్‌ ప్రతి, మొబైల్‌ నంబరు తీసుకోవాలని సూచించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు, అయిల్‌ ఫాం, కూరగాయల సాగు వైపు ప్రోత్సహిం చాలని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): భూ భారతిలో భూ సంబంధిత సమస్యలపై వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి కలెక్టరేట్‌ భవన సముదాయంలోని విభాగంలో గల సెక్షన్ల పర్యవేక్షకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ భారతి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్‌ నుంచి వచ్చిన పైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని చెప్పారు. తిరస్కరించే ఫైళ్లకు తగిన కారణాలు వివరంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కారుణ్య నియమకాల కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నివేదికలు అందించాలని తెలిపారు. చెరువులు, కాలువలు, వివిధ అభివృద్ధి పనుల కోసం సేకరించే భూములకు త్వరగా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులపై దృష్టి సారించాలని తెలిపారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నిర్మాణాలకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కొలతల అధికారి, కలెక్టర్‌ ఏవో కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 10:32 PM