Home » Telangana
పుష్ప-2 సినిమా విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అటు శ్వాస తీసుకోలేడు.. అటు అన్నం తినలేక ఈ బాలుడు పడుతున్న బాధ అర్ణనాతీతం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ నేడు నీటి మూటలుగానే మిగిలిపోయాయన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేయడవలో దిట్టగా మారిందన్నారు.
పాపానికి భయపడాల్సిన అవసరం లేదని.. పాపపు జ్ఞాపకానికే భయపడాలని గరికపాటి నరసింహారావు అన్నారు. జ్ఞాపకం ఉన్నంత కాలం పాపమైనా, పుణ్యమైనా అనుభవించక తప్పదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి పేరును ఒక్క పథకానికైనా ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ప్రస్తుత పాలకులకు రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తున్నారు కాని శ్రీకాంతాచారి గుర్తుకు రాకపోవడం దారుణమన్నారు.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.
హైటెక్ యుగంలోకూడా ఈ మూడనమ్మకాల జాడ్యం వదలడంలేదు. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్యారు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉనకనాయి.
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు ఇతర కారణాల రీత్యా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....
రామ గుండంలో వందల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడలేకనే మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, నాయకుడు కౌశిక హరి ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, మహంకాళి స్వామి అన్నారు