Home » Telangana
హైదరాబాద్ నగరంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని నగర ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్లను నిరుపేద ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు.. అంటూ సిబ్బందికి సిటీ పొలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే అసాంఘిక శక్తులు పెరిగిపోతాయని, పోలీసులు ప్రతిక్షణం అలెర్ట్‌గా ఉండాలని ఆయన సూచించారు.
ఏకగ్రీవాలు ఆగడం లేదు. సరికదా.. జోరందుకుంటున్నాయి నామినేషన్ల హడావుడి, గ్రూపు రాజకీయాలు, విజయం కోసం ఎత్తులు పైఎత్తులతో కూడిన రాజకీయాలతో వేడెక్కే గ్రామాలు కూడా చిత్రంగా ఐక్యతా రాగం వినిపిస్తున్నాయ్. వీరో.. వారో ఎవరైతే నేమీ.. వేలంపాటలో పోటీపడండి.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
నగరంలో ఆయా ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్ల తెలిపారు. వినియోగదాలు సహకరించాలని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో కోడ్ అమలు కానుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా చట్టపర చర్యలు తప్పవు. ఎన్నికల కోడ్ అమలును అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అమలు కానుం డగా, ఆయా గ్రామాల్లో కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు ప్రకటించడం గానీ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయయవద్దు
నామినేషన్ల ప్రక్రియలో పొరపాట్లు జరుగనివ్వొద్దని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కేస్లాగూడ గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అభివృద్ధికి కృషి చేయాలని జీసీసీ ఉట్నూరు డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ సోసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జీసీసీ తరుపున గిరిజన ప్రాంతంలో ఉన్న డీఆర్‌డీపోలను బలోపేతం చేసి, బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందించాలని చెప్పారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంట పొలా లకు సాగునీటిని అందించే ప్రాజెక్టుల నిర్మాణంలో అంతులేని జాప్యం తీరని వెతగా మారింది. దీంతో జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగుకు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలనే రైతులు సాగు చేస్తున్నారు.