హర్యానా నిట్ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:41 PM
హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నిట్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (NIT) తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగోత్ శివ (19) నిట్ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం హాస్టల్ గదికి వెళ్లిన శివ.. భోజనానికి రాకపోవడంతో తోటి విద్యార్థులు గదికి వెళ్లి చూశారు. ఈ క్రమంలో, శివ.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నట్లు సమాచారం.
కళాశాల యాజమాన్యం దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తోంది. విద్యార్థి మృతదేహాన్ని నిట్ (NIT) సివిల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, శివ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిట్ కురుక్షేత్ర క్యాంపస్ ముందు కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. కనీసం ఆస్పత్రి లోపలికి కూడా సిబ్బంది అనుమతించని పరిస్థితి. తమ కుమారుడి మృతిపట్ల కాలేజీ యాజమాన్యం సరిగా స్పందించకపోవడంపై శివ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Read Latest Telangana News And Telugu News