ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ.. భారీగా నగలు, నగదు అపహరణ
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:07 PM
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీకి తెగబడ్డారు దుండగులు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి, లక్ష నగదును దుండగులు అపహరించారు.
గుంటూరు, ఫిబ్రవరి 17: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర (MLA Dhulipalla Narendra) ఇంట్లో చోరీ జరిగింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు 50 తులాల బంగారం, 10 కిలోల వెండి నగలు, రూ. లక్ష నగదును దుండగులు అపహరించారు. ఈ ఘటనపై చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఘటనా స్థలిలో ఆధారాల సేకరించడంతో పాటు, సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. చింతలపూడిలోని నివాసంలో ఎమ్మెల్యే తల్లి ఉంటున్నారు. కాగా.. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి...
నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రాళ్లపాడు రిజర్వాయర్‌పై సభ్యుల ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే
Read Latest AP News And Telugu News