రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:40 AM
ఏలూరులో విషాదం చోటు చేసుకుంది. రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లిన తల్లి, కూతురు అనుకోని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 17: రొయ్యల చెరువులో ఏరియేటర్‌కు చీర చిక్కుకుని తల్లి, కుమార్తె మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. పేట కలిదిండి గ్రామానికి చెందిన గంగుల వీర నాగలక్ష్మి (32) అనే మహిళ తన 5 ఏళ్ల కుమార్తె హేమతో కలిసి రొయ్యల చెరువులో మేత వేయడానికి వెళ్లింది. చెరువులోని ఏరియేటర్ (ఆక్సిజన్ పంప్) దాటుతుండగా నాగలక్ష్మి చీర చెంగు దానికి చిక్కుకుంది. దీంతో ఆమె అకస్మాత్తుగా లాగబడి గాయపడింది. కుమార్తె హేమ కూడా తల్లిని పట్టుకుని ఉండటంతో ఆమె కూడా ఏరియేటర్‌లో చిక్కుకుంది. ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో మృతి చెందారు.
ఆదివారం జరిగిన ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతురాలి భర్త గంగుల శ్రీనివాసరావు ఫిర్యాదుతో కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏరియేటర్‌ల చుట్టూ తగిన భద్రతా జాగ్రత్తలు లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో మిగిలిన మున్సిపల్ పీఠాల కోసం ఎత్తుకు పైఎత్తులు.. అప్డేట్స్
Read Latest AP News And Telugu News