Share News

పెళ్లికి ముందు ఎవర్నీ నమ్మొద్దు!

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:56 AM

వివాహానికి ముందు శారీరక సంబంధాల విషయమై అమ్మాయిలు, అబ్బాయిలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది...

పెళ్లికి ముందు ఎవర్నీ నమ్మొద్దు!

  • శారీరక సంబంధాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: వివాహానికి ముందు శారీరక సంబంధాల విషయమై అమ్మాయిలు, అబ్బాయిలు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు, బాధిత యువతి ఇద్దరు ఏకాభిప్రాయంతోనే శారీరకసంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తోందని.. ఇలాంటి కేసులు విచారించేందుకు, శిక్షలు విధించేందుకు తగినవి కావని పేర్కొంది. ఇరు పక్షాలను మధ్యవర్తిత్వానికి పంపిస్తామని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి..

దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 17 , 2026 | 08:05 AM